పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కావలిపురం వద్ద కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన విజయ్ కృష్ణ (19) తమ ఇంటి సమీపంలో గోస్తనీ కాలువలో స్నానం చేయడానికి వెళ్లాడు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ప్రవాహ వేగానికి గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు కాలువలో వెతకగా మృతదేహం లభ్యం అయ్యింది. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి - west godavari dst corona news
కాలువలో స్నానానికి వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో జరిగింది. అతని మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
![కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి a boy was died in west godavari dst due to jumped in water canel for bath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7022991-745-7022991-1588352933153.jpg)
కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి