ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెదవేగిలో నీటిగుంతలో పడి బాలుడు మృతి - a boy was died in west godavari dst

ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో జరిగింది. బహిర్భూమికి వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.

a boy died unfortunately jumped in a water hole at west godavari dst
a boy died unfortunately jumped in a water hole at west godavari dst

By

Published : May 10, 2020, 12:07 AM IST

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో కొమ్ము కౌశిక్ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతి చెందాడు. శుక్రవారం గ్రామంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి.. అనంతరం ఒంటరిగా గ్రామానికి సమీపంలో నీటిగుంత వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు అందులో జారిపడిపోయాడు. తమ కుమారుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.

శనివారం ఉదయం గ్రామస్థులు బహిర్భూమికి నీటిగుంత వద్దకు వెళ్లగా అక్కడ కౌశిక్ మృతదేహం నీటిలో తేలుతుండటంతో సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగవెంకటరాజు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details