ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం... ఇద్దరు అరెస్ట్​ - raw liquor seized news in west godavri

పశ్చిమగోదావరి జిల్లా లక్ష్మీపురంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్​ఈబీ) అధికారులు విస్తృత దాడులు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి... 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు కొవ్వురు సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.

లక్ష్మీపురం నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ దాడులు
లక్ష్మీపురం నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ దాడులు

By

Published : Jun 17, 2020, 10:57 PM IST


పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్​ఈబీ) అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ చేసేందుకు ఉంచిన 800 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఉబా రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కొవ్వూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అతనితో పాటు బెల్లం సరఫరా చేస్తున్న తీగల శ్రీనివాసరావు అనే వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామని సీఐ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఖరీదైన బైక్​లు కొట్టారు.... పోలీసులకు చిక్కారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details