పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో సుమారు రూ.50లక్షల విలువైన 800 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఘటనలో ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. అక్రమ రవాణకు వినియోగిస్తున్న లారీ, ఇన్నోవా వాహనాలను సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..విలువ ఎంతంటే..! - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి రూ.50 లక్షలు విలువ చేస్తుందన్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఐదుగురు అరెస్టు
విశాఖ ఏజెన్సీ నుంచి భారీ ఎత్తున గంజాయి వస్తోందన్న సమాచారంతో ఏలూరు ఆశ్రం ఆస్పతి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి కర్నాటకలోని కోలారుకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఘటనలో విశాఖ జిల్లా రోగుంట మండలం బెన్నగోపాలపట్నంకు చెందిన బెన్నంనాయుడు, దుర్గాప్రసాద్, పకృద్దీన్ బాబా, గుమ్మాల శేషు, సంతోష్ కుమార్లను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి