చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం సర్కిల్ పరిధిలో జల్లెడ పడుతోంది. ఇందులో భాగంగా సీఐ భగవాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు, గణపవరం ఎస్ఐ వీరబాబు దాడులు నిర్వహించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఒకరిని, గణపవరం మండలం పిప్పర, ముప్పర్తిపాడు గ్రామాలలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 722 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
గణపవరంలో 722 కోడి కత్తులు స్వాధీనం - westgodavari district newsupdates
పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. పిప్పర, ముప్పర్తిపాడు గ్రామాల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 722 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
722 కోడి కత్తులు స్వాధీనం