పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కార్డుకు కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అరకిలో పంచదార రూ.10కి సరఫరా చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇబ్బందుల పాలవుతున్న ప్రజలకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలలుగా రేషన్ పంపిణీ చేస్తున్నాయి. 5 విడతల్లో... బియ్యంతో పాటు 3 విడతల్లో కిలో వంతున కందిపప్పు, 2 విడతల్లో శనగలు పంపిణీ చేశారు. ఆరో విడతలో బియ్యంతో పాటు శనగలు పంపిణీ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 12 లక్షల 64 వేల 568 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ సరఫరా చేయడానికి 17,500 టన్నుల బియ్యం, 1,250 టన్నుల శనగలు, 750 టన్నుల పంచదారను... జిల్లాలోని 2 వేలకు పైగా రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. 10 రోజుల పాటు వినియోగదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు.
జిల్లాలో ప్రారంభమైన ఆరో విడత ఉచిత రేషన్ పంపిణీ
కరోనా ప్రభావంతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నాయి. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆరో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటివరకు కార్డుదారులకు ఇస్తున్న వాటికి అదనంగా శనగలు ఇస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పంఫిణీ చేస్తోన్న ఉచిత రేషన్