మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా... పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రదర్శనను ప్రారంభించారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని... గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సీఎం జగన్ నిజం చేశారని... మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. విద్యార్థులు విద్వేషాలకు తావివ్వకుండా... సత్యం, అహింస మార్గాల్లో నడవాలని మంత్రి సూచించారు.
తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన - 450 feet National Flag Exhibition in Tadepalligudem news
మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా... తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన