ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం... వాళ్లకు తప్పదా అంధకారం..! - పోలవరంతో లక్షల మంది జీవితాల్లో చీకట్లు

వారు లోకజ్ఞానం తెలియని అమాయక ప్రజలు. అడవుల్లో దొరికే ఉత్పత్తులు సేకరించి జీవనం సాగిస్తుంటారు. వనాల్లో నివసించే వారికి పట్టణ సంస్కృతి, సంప్రదాయాలు అర్థం కావు. అలాంటి వారి మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారబోతుంది. పోలవరం ప్రాజెక్టుతో సుమారు నాలుగు లక్షలమంది గూడు చెదరబోతోంది!

4-lakh-land-expatriates-in-polavaram-project
పోలవరం...లక్షల మంది జీవితాలు అంధకారం

By

Published : Mar 2, 2020, 12:39 PM IST

పోలవరం...లక్షల మంది జీవితాలు అంధకారం

వారికి అడవులే ప్రపంచం.. అదే వారి జీవనాధారం. పట్టణాలు, నాగరికతతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్న వారి భవిష్యత్తు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మిగిలింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులు అడవులు వదిలి వెళ్లాలని ప్రాజెక్టు అధికారులు సూచించగా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

నాలుగు లక్షల మంది నిర్వాసితులు..
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద ఆనాటి కాంగ్రెస్​ ప్రభుత్వం 170 అడుగుల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగు లక్షల మంది గిరిజన, గిరిజనేతర ప్రజలు నిర్వాసితులు కానున్నారు.

రామయ్య సన్నిధికి ప్రాజెక్టు ముప్పు
భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాలలోని ప్రజలు నిర్వాసితులు కానున్నారు. వీటితోపాటు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి రామయ్య ఆలయానికి ముప్పు పొంచి ఉందని పలువురంటున్నారు.

దిక్కుతోచని స్థితి..
ఏటా వర్షాకాలంలో నీటిమట్టం 50 అడుగులు దాటితే భద్రాచలం పట్టణానికి వరద వస్తోంది. పోలవరం పూర్తయితే భద్రాద్రిలో 70 అడుగుల నీటిమట్టం ఉంటుంది. ఇదే జరిగితే.. భద్రాచలం శివారు కాలనీలన్నీ నీట మునుగుతాయి. అక్కడ నివసించే ప్రజలు ఎటువైపు వెళ్లాలో.. ఎక్కడ తలదాచుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించాలని.. లేకపోతే నిర్మాణాన్ని ఆపివేయాలని నిర్వాసిత ప్రజలు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవీ చూడండి:ఈనెల 6 నుంచి శాసనసభ​ సమావేశాలు.. 8న బడ్జెట్​..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details