ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడో రోజు జోరుగా కోడి పందాలు - జోరుగా కోళ్లపందేలు

పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో రోజు కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెంరాయుళ్లు బరులకు చేరుకుని ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

3rd-cock-fight-in-west-godavari-district
మూడో రోజు జోరుగా కోడి పందాలు

By

Published : Jan 15, 2021, 1:28 PM IST


పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో మూడో రోజు కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పందేలకు చివరి రోజు కావడంతో పందెం రాయుళ్లు కోడి పందాల బరులకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తణుకు, ఉండ్రాజవరంతోపాటు తేతలి, దువ్వ, వేల్పూరు, అత్తిలి, వడ్లూరు ఇరగవరం తదితర ప్రాంతాల్లో కోడిపందాలు భారీగా జరుగుతున్నాయి.

కోడి పందాలతోపాటు గుండాటలు, జూదాలు భారీగానే సాగాయి. లక్షల రూపాయలు చేతులు మారాయి. ఉభయ గోదావరి జిల్లాలలోనే గడిచిన రెండు రోజుల్లోనే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details