పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, ఉండి మండలాలలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారి కుటుంబసభ్యులను వైద్య పరీక్షల కోసం ఏలూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం 33మందిని భీమవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ రోజు సాయంత్రానికి వీరి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
భీమవరం క్వారంటైన్ కేంద్రంలో 33 మంది అనుమానితులు - corona updates in west godavari
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైరస్ సోకి ఉండవచ్చుననే అనుమానంతో వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
భీమవరం క్వారంటైన్ కేంద్రంలో 33 మంది అనుమానితులు