పశ్చిమగోదావరి జిల్లాలో 27 మండలాలను.. అధికారులు రెడ్‌జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మిగతా 21 మండలాలను గ్రీన్ జోన్లో ఉంచారు. పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన ఏలూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, కొవ్వూరు పట్టణాల్లో పూర్తిగా ప్రజల రాకపోకలు కట్టడి చేశారు. జిల్లాలో 39 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏలూరులో అత్యధికంగా 15, పెనుగొండ 11, తాడేపల్లిగూడెం 5, భీమవరం 2, ఉండి 2, ఆకివీడు 1, నరసాపురం 1, గుండుగొలను 1, కొవ్వూరు 1.. పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1587 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఏలూరులో పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడంతో.. లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా.. నిత్యావసర సరకులు, కూరగాయలు సరఫరా చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్జోన్లలో 27 మండలాలు - ఏపీలో లాక్డౌన్ వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా 27 మండలాలను రెడ్‌జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. రెడ్జోన్లలో లాక్‌డౌన్‌ని కట్టుదిట్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలను ఇంటికే పంపిస్తున్నారు.

27 mandals are in Red Zone at West Godavari district