పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. పల్లె పల్లెకు వ్యపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై కేసులు నమోదైన చోట్ల కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. తాజాగా రో 26 కంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించినట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు.
ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. కొత్తగా ప్రకటించిన కంటైన్‌మెంట్ జోన్ల వివరాలివీ..
● ఉండి రాజులపేట రెండో సచివాలయం 11, 12, 13 వార్డులు, బస్టాండు వద్ద మూడో సచివాలయం 5వ వార్డు, యండగండి రేపేట రెండో సచివాలయం 12వ వార్డు, పడవల రేవు ఒకటో వార్ఢు
● పాలకోడేరు మండలం మైపా ఎస్సీ పేట 5, 6 వార్డులు.
● ఆకివీడు మండలం ఐ.భీమవరం 4వ వార్ఢు
● తాడేపల్లిగూడెం మండలం మాధవరం 13వ వార్ఢు
● ఉంగుటూరు మండలం బొమ్మిడి 3వ వార్ఢు
● ఆచంట మండలం వర్ధనపుగరువు పెనుమంచిలి ఒకటో వార్ఢు
● నిడదవోలు మండలం విజ్జేశ్వరం 5వ వార్ఢు
● ఉండ్రాజవరం అరుంధతిపేట 5, 7 వార్డులు.
● జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి, పి.అంకంపాలెం.
● భీమవరం చిన్నపేట 23వ వార్డు, సర్రాజువీధి 28 వార్డు, 19వ వార్డు, దుర్గాపాలెం కాల్వ గట్టు 39వ వార్డు, 30వ వార్ఢు
● నరసాపురం మండలం పసలదీవి రామాలయం కూడలి వద్ద 8వ వార్ఢు
● ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం బీసీ కాలనీ 3వ వార్డు, ఎస్సీ కాలనీ 6వ వార్డు
● గణపవరం మండలం కొత్తపల్లి 1, 2 వార్డులు.
● కాళ్ల మండలం కాళ్లకూరు 6వ వార్ఢు