కబడ్డీ పోటీలను చూస్తే ఇంకా సంక్రాంతి వెళ్లనట్లే ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అన్నారు. నరసాపురంలో రుస్తుం బాధ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మహిళా విభాగంలో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, దిల్లీ జట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. పురుషుల విభాగం ఆంధ్ర, చిల్లర్స్ క్లబ్ దిల్లీ, కర్ణాటక, విదర్భ జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రూ. లక్ష, రూ.75 వేలు,రూ, 50వేలు, రూ. 25 వేలు చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగానే చూడాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల పిల్లలు ఆటలకు దూరమైపోతున్నారని అన్నారు. మానసిక శారీరక వికాసానికి దోహదపడే క్రీడలను ప్రోత్సహించాలన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ ఛైర్మన్ కౌరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురంలో ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు - నరసాపురంలో ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రుస్తుం బాధ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి.

ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు