పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి... రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడింగ్ చేస్తుండగా... సిఎస్ఆర్ఏ సునీతతో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. లారీ, ఆటో, గోదాములో ఉన్న బియ్యం సుమారు 20 టన్నుల మేర ఉంటుందని అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం - దెందులూరులో రేషన్ బియ్యం పట్టివేత న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
![20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5102346-236-5102346-1574076825492.jpg)
20 tonnes of ration rice seized in west godavari district
దెందులూరులో 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం