పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24గంటల వ్యవధిలో జిల్లాలో 17పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో ఏలూరులో నాలుగు, తణుకులో రెండు, నరసాపురంలో రెండు, మొగల్తూరులో రెండు, పెదవేగిలో రెండు, పోడూరులో రెండు, నల్లజర్లలో రెండు, తాడేపల్లిగూడెంలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 164కు చేరుకొంది. వీటితో జిల్లాలో మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 395కు చేరుకొంది. కొత్తగా ఏడు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. పాజిటివ్ కేసులు నమోదైనవారిలో ఆరోగ్యంగా ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించగా... అనారోగ్యంతో బాధపడుతున్నవారిని కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవడం వల్ల కరోనా నియంత్రణ చర్యలు అధికారులు ముమ్మరం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు - పశ్చిమగోదావరిలో కరోనా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ జిల్లాలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మెుత్తం వైరస్ బాధితుల సంఖ్య 395కి చేరిందని అధికారులు తెలిపారు.

పశ్చిమగోదావరిలో కొత్తగా నమోదైన 17 కరోనా పాజిటివ్ కేసులు