Cannabis Seized: జీలుగుమిల్లిలో భారీగా గంజాయి పట్టివేత..విలువ ఎంతంటే..! - ఏపీ న్యూస్ అప్డేట్స్
13:44 October 01
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్‌పోస్టు వద్ద 1530 కిలోల గంజాయిని పోలీసులు(cannabis Seized) పట్టుకున్నారు. లారీ ట్యాంకర్లో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి లారీ, 3 సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా(west godavari district) జీలుగుమిల్లి వద్ద ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కోటి రూపాయలు విలువ చేసే 1530 కిలోల గంజాయిని (cannabis Seized) పోలీసులు పట్టుకున్నారు. సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు కుంట నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ రామ శంకర్ యాదవ్, క్లీనర్ జ్ఞానేంద్ర త్రిపాఠిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 287 ప్యాకెట్లలో తరలిస్తున్న 1530 కిలోల గంజాయితో పాటు లారీ, మూడు చరవాణీలు,రూ.ఐదు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1కోటి 55 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అభినందించారు.