పశ్చిమ గోదావరి జిల్లాలో 24 గంటల వ్యవధిలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకొంది. ఇందులో 54మంది కోవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరారు. 33 యాక్టివ్ పాజిటివ్ కేసులకు ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పెదవేగి మండలం పినకడిమిలో 11, పెనుగొండ మండలం సిద్ధాంతం, పెదపాడు మండలంలోని రాజుపేటలో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఒక్క రాజుపేట మినహా మిగిలిన అన్ని పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులవిగా అధికారులు నిర్ధరించారు.