సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 108 సిబ్బంది సమ్మెబాట పట్టారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన వేతన బకాయిలు విడుదల చేసే వరకు సమ్మె విరమించేది లేదన్నారు.సిబ్బంది సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయి.
కలెక్టరేట్ ఎదుట 108 సిబ్బంది ధర్నా - బకాయి జీతాలు
బకాయి జీతాలు ఇవ్వాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కలెక్టరేట్ వద్ద 108 సిబ్బంది ధర్నా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేస్తున్న సిబ్బంది