ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్రారంభం - ysr sampoorna poshana scheme in krishna district

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైఎస్​ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పేదలకు సంపూర్ణ ఆహారం అందించేందుకు ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పోషకాహార కిట్లు అందజేశారు.

YSR sampoorna poshana scheme starts in various places in andhrapradhesh
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలు ప్రారంభం

By

Published : Sep 8, 2020, 9:27 PM IST

కృష్ణా జిల్లాలో...

మైలవరం ఐసీడిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పధకం వరప్రసాదం లాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి పధకాన్ని ఇంత వరకూ ఏ రాష్ట్రం అమలు చేయలేదన్నారు. లబ్ధిదారులకు సంపూర్ణ పోషణ కిట్​లు పంపిణీ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మంగళవారం అడ్డతీగలలోని ఐసీడీఎస్ కార్యాలయంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార కిట్లు అందజేశారు.

విజయనగరం జిల్లాలో...

సాలూరులో వైయస్​ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు. రాష్ట్రంలోని చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు సంపూర్ణ పోషణ కోసం ప్రభుత్వం రూ. 1,863 కోట్లు కేటాయించిందన్నారు.

ఇదీ చదవండి:

అంతర్వేదిలో ఉద్రిక్తత... మంత్రులపై హిందూ సంస్థల ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details