మూడో ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతుభరోసా పథకంలో భాగంగా 3,12,799మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున నగదు జమ అయింది. ఈ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా అధికారులు... దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. పెట్టుబడికి రైతులకు ఇబ్బంది కలగకుండా.. రైతు భరోసా నగదు ఉపయోగపడుతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు.
రైతు భరోసా నిధులు విడుదల... ఖాతాల్లో నగదు జమ - విజయనగరం జిల్లాలో రైతు భరోసా
విజయనగరం జిల్లాలో 3,12,799 మంది రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ అయింది. సుమారు రూ.234.60కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా విడుదల చేశారు.
విజయనగరం జిల్లాలో రైతు భరోసా నిధులు విడుదల