రాష్ట్రంలో గ్రామ సచివాలయ భవనాలు వైకాపా పార్టీ రంగులతో దర్శనమిస్తున్నాయి. విజయనగరంజిల్లా మెరకముడిదాం మండలం బైరిపురం సచివాలయ ఆవరణలో ఉన్న... మహాత్మా గాంధీ విగ్రహం దిమ్మెకు కూడా వైకాపా రంగులు వేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని గ్రామ సచివాలయంగా తీర్చిదిద్దారు. భవనాన్ని ఆధునీకరించి రంగులు వేశారు. గాంధీ విగ్రహం దిమ్మెకు సైతం వైకాపా రంగు వేయడంపై స్థానికులతో పాటు దేశభక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు.. దేశభక్తుల ఆవేదన
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మారుతున్నాయి. గ్రామ సచివాలయాలకు వైకాపా పార్టీ రంగులు అద్దుతున్నారు. విజయనగరం జిల్లా బైరిపురం సచివాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు.. దేశభక్తుల ఆవేదన