ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైఎస్ఆర్ జ‌ల‌క‌ళ ద్వారా రైతుల‌కు ఎంతో మేలు'

By

Published : Sep 29, 2020, 12:02 AM IST

వైఎస్ఆర్ జ‌ల‌క‌ళ ద్వారా రైతుల‌కు ఎంతో మేలు క‌లుగుతుందని... ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలో జలకళ బోర్ వెల్స్ ను ప్రారంభించారు.

ysr jalakala starts at vizinagaram district
వైఎస్ఆర్ జ‌ల‌క‌ళ

వైఎస్ఆర్ జలకళ పథకం ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం అనంతరం. .. కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైకాపా ఎమ్మెల్సీ సురేష్, పలువురు ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన జలకళ బోర్ వెల్స్ ను ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని 9 నియోజకవర్గాలకు సంబంధించిన జలకళ రిగ్గులను జెండా ఊపి ప్రారంభించారు.

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ అన్నారు. రైతుల కోసం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా బోర్లతోపాటు, చిన్న‌, స‌న్నకారు రైతుల‌కు ఉచితంగా మోటార్లు ఏర్పాటుకు వైఎస్ జలకళ కార్యక్రమాన్ని అమలు చేయటం హర్షణీయమన్నారు. విజయనగరంజిల్లా వంటి మెట్టప్రాంతాల రైతులకు ఈ పథకం ఓ వరం లాంటిందని చెప్పారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details