సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘం విభాగాల ఆధ్వర్యంలో...రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
వైఎస్ జగన్ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరం - ప్రారంభమైన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 21 జననేత పుట్టిన రోజు కావడంతో.. ఒకరోజు ముందుగానే అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రారంభమైన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు