విజయనగరంలోని స్థానిక గంజిపేట వద్ద యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ... వ్యక్తి మృతికి కారణమయ్యింది. మంగళవారం అర్ధరాత్రి విందు చేసుకుందామని ఒక చోటికి చేరిన యువకులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో వినోద్ కుమార్ (25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్థానిక స్వీపర్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
యువకుల మధ్య ఘర్షణే.. హత్యకు కారణమా..? - vizianagaram district latest crime news
సరదాగా విందు చేసుకుందామని ఒక చోటికి చేరిన యువకులు మధ్య జరిగిన ఘర్షణ.. యువకుడి మృతికి కారణమయ్యింది. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మృతి చెందిన యువకుడు
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. యువకుడిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘర్షణకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: