ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరబిందో పరిశ్రమలో ప్రమాదం.. యువకుడు మృతి - అరబిందో రసాయన పరిశ్రమ

శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలోని అరబిందో రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

అరబిందో రసాయన పరిశ్రమలో యువకుడు మృతి

By

Published : Aug 11, 2019, 7:36 PM IST

అరబిందో రసాయన పరిశ్రమలో యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలోని అరబిందో రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బాయిలర్​ పేలి విజయనగరం జిల్లా పార్వతీపురం వివేకానంద కాలనీకి చెందిన రెడ్డి రాహుల్ మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విషయం తెలియటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రాహుల్​కు భార్య, మూడేళ్ల కొడుకు ఉన్నాడు. రాహుల్​ ప్రతిరోజూ విజయనగరం నుంచి విధులకు వెళ్తుంటాడు. ఒక్కగానొక్క కొడుకు డ్యూటీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రుల తల్లడిల్లుతున్నారు. రాహుల్ మరణవార్త కాలనీలో విషాదం నింపింది.

ABOUT THE AUTHOR

...view details