విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళానికి చెందిన సాయికుమార్ జీవనోపాధి కోసం విశాఖజిల్లా పెందుర్తిలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు రహదారిపై పడిపోయాడు. వెనకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు అతని మీద నుంచి వెళ్లింది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు బస్సు కింద పడిన యువకుడు... అక్కడికక్కడే మృతి - vizianagaram latest news
కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బతుకుదెరువు కోసం వచ్చిన యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది.

యువకుడు మృతి