విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్త వలస డ్యాం వద్ద సువర్ణముఖి నదిని దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకు పోయిన యువకుడు మృతి చెందాడు. పార్వతీపురం మండలం బంధలుపి గ్రామానికి చెందిన దొడ్డి శివ కుమార్(25), ఆయన స్నేహితుడు వినోద్ స్వగ్రామం నుంచి సీతానగరం మండలం వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో డ్యాం వద్ద శివ కుమార్ ద్విచక్ర వాహనం నడుపుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశాడు. ప్రవాహ ఉధృతికి యువకుడు నీటిలో కొట్టుకు పోయాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్థులు, స్థానికులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి శివ కుమార్ మృతదేహం డ్యాం సమీపంలో లభ్యమైంది. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ మోహన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సువర్ణముఖి నదిలో కొట్టుకుపోయిన యువకుడు మృతి - Suvarnamukhi river at vizianagaram district news
విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్త వలస గ్రామం వద్ద సువర్ణముఖి నది ప్రవాహంలో గల్లంతైన యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యల్లో పోలీసులు యువకుడి మృతదేహాన్ని గుర్తించారు.
నదిలో కొట్టుకుపోయిన యువకుడు మృతి
Last Updated : Oct 28, 2020, 9:10 AM IST