విజయనగరం జిల్లా పార్వతీపురంలోని యువతి మౌన పోరాటం చేస్తోంది. మధు అనే యువకుడు, యువతి పదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన యువకుడు... అన్నయ్య వివాహమయ్యాక అని కొన్నాళ్ళు, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని ఇంకొన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా చేసుకుంటానని నమ్మబలికి తప్పించుకు తిరుగుతున్నాడు. విషయం గ్రహించిన యువతి ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. యువకుడి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతికి రక్షణ కల్పించారు. యువకునితో పెళ్లి జరిపించి తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నారు యువతి తల్లిదండ్రులు.
పార్వతీపురంలో ప్రియుడి కోసం యువతి మౌన పోరాటం - Young girl silent fight for boyfriend in Parvathapuram vizainagaram district
పదేళ్ళుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి ఊసెత్తేసరికి ముఖం చాటేశాడు. ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. యువకుడు కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు.
పార్వతీపురంలో ప్రియుడి కోసం యువతి మౌన పోరాటం