ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం - గమ్యం లేని తమ జీవితాలకు ఈ స్టార్టప్‌ ఓ భరోసా

young boy start a company and helpful for students: పర్యావరణానికి మేలుచేసే సాంకేతిక ఆవిష్కరణల కోసం పరితపిస్తూ తన కన్న కలలను నిజం చేసుకోవటానికి పట్టుదలతో ఎవరి సహాయం తీసుకోకుండా తన లక్ష్యాన్ని సాధించుకున్న యువకుడి కథ. ఇంతకీ ఎవరా ఆ యువకుడు. ఎలా సాధ్యం అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

young_boy_start_a_company_and_helpful_for_students
young_boy_start_a_company_and_helpful_for_students

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 7:53 PM IST

సాంకేతిక ఆవిష్కరణతో యువకుడి స్టార్టప్ కంపెనీ

Young Boy Start A Company And Helpful For Students:గౌతమ్‌ అనేఓ యువకుడుసమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అతనికి అలవాటు. ఇంజినీరింగ్‌ చదవకున్నా ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్టీరింగ్‌లెస్‌ కారు, రైతుల కోసం వివిధ వ్యవసాయ ఉపకరణాలూ రూపొందించాడు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు G3 స్టోర్స్‌ అనే అంకురాన్నీ స్థాపించాడు. ఉచిత శిక్షణ, స్వయం ఉపాధితో పాటు లాభాల్లో వాటాను పంచుతున్నాడు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.

Made A New Devices In Young Boy: పర్యావరణానికి మేలుచేసే సాంకేతిక ఆవిష్కరణల కోసం పరితపిస్తుంటాడు ఆ యువకుడు. ఇదే గాక ఆవిష్కరించిన ప్రతీది సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తాడు. అందుకే తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని నిరుద్యోగులకు నేర్పించి స్వయంగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నాడు. సరికొత్త ఆవిష్కరణలకు ప్రణాళికలు రచిస్తూనే G3 స్టోర్స్‌ అనే అంకురంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నాడు.

Young Boy Life Story: గౌతమ్‌ది మన్యం జిల్లాలోని పార్వతీపురం. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్‌లో పీజీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే తనకు సాంకేతిక పరమైన విషయాలపై ఉత్సాహం ఎక్కువ. ఆ ఇష్టంతోనే డబుల్‌ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్‌ బైక్‌లు(Electric bikes) , స్టీరింగ్‌ లేని కార్లు, రైతుల కోసం మల్టిపుల్‌ స్పేయర్లు రూప కల్పన చేశాడు. కొనుగోలు దారులకు వ్యయభారం తగ్గించేలా ఆవిష్కరణలు చేయడం ఇతని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

చదివింది సైన్స్‌ కోర్సులే అయినా ఇతని ఆవిష్కరణలన్నీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు చెందినవే. తన ప్రతిభ, సామర్థ్యంపై విశ్వాసంతో ముంబయిలో నెలకు 80వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. గౌతమ్‌పై నమ్మకంతో గీతం విశ్వవిద్యాలయం ఉచితంగా వర్క్‌షాప్‌, ల్యాబ్‌లు వాడుకునే అవకాశమిచ్చింది. వారి సహకారంతో తక్కువ ఖర్చుతోనే ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, రైతుల కోసం స్పేయర్లు, పంపులు లాంటివి ఎన్నో ఆవిష్కరించాడు. కేవలం 5 లక్షల పెట్టుబడితో జీ3 స్టార్టప్‌ని మొదలుపెట్టాడు గౌతమ్‌. విద్యార్హతతో పని లేకుండా ఆసక్తి ఉన్న యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాడు. మరో 6 నెలల్లో కొత్త ఆఫీన్‌ను ఏర్పాటు చేసి మరింత మందికి అవకాశమిస్తానంటున్నాడు. -గెంబలి గౌతమ్, జీ3 స్టోర్స్‌ వ్యవస్థాపకుడు

G3 and start up company Founder Young Boy : ప్రేమ్ జీ ఫౌండేషన్ , వాసన్ వంటి సంస్థల ఆర్ధిక తోడ్పాటుతో ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన గౌతమ్‌ చేశాడు. మొదట్లో ఈవీ సంబంధిత సాధనాలనే ఎక్కువగా తయారుచేసినా తర్వాత వ్యవసాయ ఉపకరణాలపై దృష్టి కేంద్రీకరించాడు. కొంతకాలం గడిచాక దీనినే స్టార్టప్‌గా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చిందన్నాడు. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో నాలుగేళ్ల క్రితం జీ3 స్టార్టప్‌ను ప్రారంభించాడు. G3 స్టోర్స్‌లో సాగుదార్లకు అనువైన వ్యవసాయ ఉపకరణాలు గౌతమ్‌ తయారుచేస్తున్నాడు.

ఆన్‌లైన్‌ మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. జీతభత్యాలు పోగా మిగిలిన సొమ్మును డిపాజిట్‌ చేసి భవిష్యత్తు పరిశోధనలు, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. నచ్చిన రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తూనే నిరుద్యోగులకు ఆర్థిక గౌతమ్‌ తోడ్పాటునందిస్తున్నాడు. భవిష్యత్తులో G3 స్టోర్స్‌ ద్వారా మరింతమంది స్వయంఉపాధి అందుకునేలా చేయడమే తన లక్ష్యం అంటున్నాడు. G3 స్టోర్స్ ద్వారా 15మంది యువకులు ఉపాధి పొందుతున్నారు. కొందరు చదువుకుంటూనే పనిచేస్తున్నారు. గమ్యం లేని తమ జీవితాలకు ఈ స్టార్టప్‌ ఓ భరోసాను ఇచ్చిందని ఆ యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details