తాడి జగదీష్‌ది విజయనగరం జిల్లా సాలూరు మండలం గంగారావు కోట బూర్జి వీధి. ఈ యువకుడు సరదా కోసం శిఖపరువు జలపాతానికి వెళ్లాడు. నీటిలో ఈత కొడుతుండగా తలకి బలంగా రాయి తగిలింది. నొప్పిని భరించలేక నీటిలో మునిగిపోతున్న జగదీష్‌ను గుర్తించిన తోటి యువకులు బయటికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడా యువకుడు. జగదీష్ మృతిపై కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
జలపాతం చూడటానికి వెళ్లిన యువకుడు మృతి - Vizianagaram District saluru news
సరదాగా జలపాతం వద్దకు వెళ్లిన యువకుడు నీటిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు తలకి రాయి తగిలింది. అంతే ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. ఘటనను గమనించిన తోటి యువకులు అతనిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది.
సరదాగా వాటర్ ఫాల్స్‌కి వెళ్లిన యువకుడు మృతి