శారీరకపరమైన సాధనల(యోగా)తో కండారాలు దృఢంగా తయారవుతాయని విజయనగరం జిల్లా జేసీ కిషోర్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా విజయనగరంలో 5కే రన్ నిర్వహించారు. స్థానిక కోట నుంచి జిల్లా పరిషత్ వరకు నిర్వహించిన ఈ రన్‌ను జేసీ జెండా ఊపి ప్రారంభించారు. యోగా.. ఒక జీవన విధానం అని.. చిన్నాపెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేయాలని ఆయన సూచించారు. యోగాలో కొన్ని ప్రాణాయామాలు చేస్తే కరోనాను జయించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్డీవో భవానీ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
'యోగాలో కొన్ని ప్రాణాయామాలు చేస్తే కరోనాను జయించొచ్చు' - విజయనగరంలో యోగా డే ఉత్సవాలు
యోగాలో కొన్ని ప్రాణాయామాలు చేస్తే కరోనా వ్యాధిని జయించవచ్చని విజయనగం జిల్లా జేసీ కిషోర్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2021) పురస్కరించుకొని విజయనగరంలో 5కే రన్ నిర్వహించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం