ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీ డిక్లరేషన్ అమలే ప్రధానాంశంగా.. "వైసీపీ జయహో బీసీ మహాసభ" - వైసీపీ జయహో బీసీ మహాసభ పోస్టర్​ రిలీజ్​

YCP JAYAHO BC MAHASABHA: ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మోహన్ రెడ్డి ఏలూరులో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు ప్రధానాంశంగా.. ఈ నెల 7న విజయవాడలో "వైసీపీ జయహో బీసీ మహాసభ" జరపనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీసీ మహాసభకు సన్నద్ధత, బీసీ నేతల సమీకరణపై ఉమ్మడి విజయనగరం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.

YCP JAYAHO BC MAHASABHA
YCP JAYAHO BC MAHASABHA

By

Published : Dec 3, 2022, 10:38 AM IST

BOTSA ON YCP JAYAHO BC MAHASABHA : ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏలూరులో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు ప్రధానాంశంగా.. ఈ నెల 7న విజయవాడలో "వైసీపీ జయహో బీసీ మహాసభ" జరపనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీసీ మహాసభకు సన్నద్ధత, నేతల సమీకరణపై ఉమ్మడి విజయనగరం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి బొత్స సమావేశమయ్యారు. బీసీ మహాసభలో గ్రామ, వార్డు సభ్యుడి స్థాయి నుంచి చట్టసభల వరకు వివిధ హోదాలు ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ పదవులో ఉన్న బీసీలంతా పాల్గొంటారని బొత్స తెలిపారు. వీరందరిని గ్రామాల వారీగా సమీకరించి.. సభకు తరలించే కార్యక్రమంపై చర్చించామన్నారు.

విజయనగరంలోని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య స్వగృహంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​తో పాటు విజయనగరం, మన్యం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.ఈ సభలో ఏలూరు బీసీ డిక్లరేషన్​లోని హామీలు, ఇప్పటి వరకు వాటి అమలు, పెండింగ్ అంశాలు, భవిషత్తులో బీసీల అభ్యున్నతకు చేపట్టాల్సిన చర్యలను చర్చించి సమీక్షిస్తామన్నారు. సమావేశానికి ముందు.. వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు జయహో బీసీ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details