ఈనెల 11న విజయనగరంలో భాజపా - జనసేన కార్పొరేటర్ అభ్యర్థిపై వైకాపా వర్గం దాడి చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈనెల 11న రాత్రి 8.30 గంటల సమయంలో కాళ్ల నారాయణరావుపై వైకాపా వర్గం వారు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా.. విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. దీనిపై నారాయణరావు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో బుధవారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు.
భాజపా - జనసేన కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్ - విజయనగరంలో భాజపా వైకాపా నేతల ఘర్షణ
ఈనెల 11న విజయనగరంలో భాజపా - జనసేన కార్పొరేటర్ అభ్యర్థిపై వైకాపా వర్గం దాడి చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
భాజపా-జనసేన కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి కేసులో ఐదుగురు అరెస్ట్