బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ దృష్టి సారించారు. ఈ మేరకు.. పూసపాటిరేగ మండలంలో తీర ప్రాంతమైన కోనాడలో కలెక్టర్ పర్యటించారు. యాస్ తుపాను ప్రభావంపై కోనాడ మత్స్యకారులు, స్థానికులతో చర్చించారు. అనంతరం తుపాను షెల్టర్ సందర్శించి ముందస్తు ఏర్పాట్లు, నిత్యావసర సరుకుల నిల్వలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంత గ్రామాల్లో.. సిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
యాస్ ప్రభావం: అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం - విజయనగరానికి యాస్ తుపాను ఎఫెక్ట్ వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పూసపాటిరేగ మండలంలో తీర ప్రాంతమైన కోనాడలో కలెక్టర్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను.. స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
Breaking News