విశాఖ జిల్లాలో...
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా విశాఖలో పలువురు రక్తదానం చేశారు. విశాఖ కెమిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ రక్త నిధి కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అత్యంత అరుదైన ఏబీ నెగిటివ్ రక్తాన్ని వరుసగా 103 సార్లు దానమిచ్చిన డీవీ. నాగేశ్వరరావుని విశాఖ కెమిస్ట్స్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు, బ్లడ్ బ్యాంకు ముఖ్య సభ్యుడు ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ ఘనంగా సత్కరించారు. లాక్ డౌన్ తరుణంలో ప్రస్తుతం అన్ని రక్త నిధి కేంద్రాలలో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని... ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ కెమిస్ట్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు.
కృష్ణాజిల్లాలో...
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా, అవనిగడ్డలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 50 సార్లు రక్తదానం చేసిన పలువురు దాతలను అధికారులు సన్మానించారు. దివిసీమలో యువత రక్తదానం పట్ల ఎంతో ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇప్పటికి తొమ్మిది వందల మంది వరకు ఆపదలో ఉన్న వారికి తమ కాలేజీ విద్యార్థులు రక్తదానం చేసినట్టు కళాశాల అధ్యాపకులు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సాలూరు పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.
పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ప్రపంచ రక్తదానం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, ఆర్ఎంఓ వెంకట్రావు అధ్యక్షతన రక్త దాతలు గుప్త, బి. రామకృష్ణ, విజయమోహన్, శ్రీకాంత్, జనసేన పార్టీ యూత్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రక్తదానానికి యువత మరింతగా ముందుకు రావాలని కోరారు.
ఇదీ చదవండి: కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి