పాఠశాలల్లో పుస్తకాలు, పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థులు గుడ్లు, వంటపాత్రలు మోయాల్సిన దుస్థతి దాపురించింది. ప్రభుత్వం కోట్లు వెచ్చించి పాఠశాలను కార్పొరేట్ స్థాయి తీసుకెళ్లాలనే ఆశయం నీరుగారుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తూడెం, జగ్గయ్యపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో కనిపించిన ఈ దృశ్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితికి అద్దపడుతున్నాయి. తూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఉడికించిన గుడ్లును విద్యార్థులే వలిచి సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయులు పక్కనే ఉంటూ వారి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యారు. జగ్గయ్యపేట రహదారిపై గుడ్లు తీసుకువచ్చే వాహనం నుంచి నేరుగా పాఠశాల భవనానికి సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులతో గుడ్లు మోయిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితులు దాపురీస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులతో, పాటు పాఠశాల విద్యా కమిటీ సభ్యులు చెబుతున్నారు.
ఉపాధ్యాయుల సాక్షిగా.. విద్యార్థులతో వెట్టి చాకిరీ - విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో స్కూల్లు తాజా వార్తలు
బాలలను రేపటి పౌరులుగా తీర్చి దిద్దే బడుల్లో వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన చేతులు.. వంట పాత్రలు, గుడ్లు పట్టుకొని పనులు చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని తూడెం, జగ్గయ్యపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ వ్యవహారం జరుగుతోంది.
పాఠశాలల్లో విద్యార్ధులతో పనులు చేయిస్తున్న వైనం