ప్రభుత్వ రంగ సంస్థలు, కార్మిక రంగాల పట్ల కేంద్రం తీరుని నిరసిస్తూ... పలు కార్మిక సంఘాలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయు, ఎఐఎఫ్టీయు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల మార్పులను కేంద్రం విరమించుకోవాలని, పని గంటల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, రక్షణ రంగం ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. కేంద్రం వీటిపై పునరాలోచించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన - రక్షణ రంగం ప్రవేటీకరణ తాజా వార్తలు
కరోనా నియంత్రణ చర్యల నెపంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని... కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. కేంద్రం తీరుని నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ నిరసన