విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీనివాస కోళ్ల పరిశ్రమ కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా యాజమాన్యం మొండివైఖరితో వ్యవహరిస్తోందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేదిలేదని తేల్చి చెప్పారు.
నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాల బకాయిలు చెల్లించకపోవడం, గ్రాట్యుటీ, పీఎఫ్ ఇవ్వకపోవడంపై ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, నర్సింగరావు, సుందర్రావు, త్రినాథరావు పాల్గొన్నారు.