విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గర్భం గ్రామంలో మహిళలు ధర్నా చేశారు. మద్యం దుకాణాలు మూసేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గర్భం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బుదరవలసలో కరోనా సోకిన వ్యక్తులు ఉన్నారు.
అక్కడి నుంచి గ్రామస్థులు వచ్చి ఈ గ్రామంలోని దుకాణంలో మద్యం కొంటున్నారు. వాళ్ల ద్వారా కరోనా వ్యాధి తమ గ్రామంలో ఉన్న వారికి సోకుతుందేమోనని భయంతో ఆందోళన చేశారు. వెంటనే అమ్మకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు.