విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ములసేలాగంలో ఎన్నికల ఎర్రమ్మ(30) అనే మహిళ హత్యకు గురైంది. మంగళవారం రాత్రి ఎర్రమ్మ హత్యకు గురైనట్లు గ్రామస్థులు వెల్లడించారు. అయితే హత్య జరిగిన అనంతరం మృతురాలి భర్త పెంటయ్య గ్రామం నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పెంటయ్యే ఎర్రమ్మను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వివాహిత హత్య.. భర్తపైనే పోలీసుల అనుమానం - తాజా నేర వార్తలు
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ములసేలాగంలో ఓ మహిళ హత్యకు గురైంది. మహిళ హత్య అనంతరం భర్త గ్రామం నుంచి పారిపోయాడు. దీంతో భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
హత్యకు గురైన మహిళ