ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల క్రితం అదృశ్యం..'శారద ఫౌండేషన్' సహకారంతో ప్రత్యక్షం

తలపై కొబ్బరికాయ పడటంతో మతిస్థిమితం కోల్పోయింది. తల్లి మరణంతో రోడ్డునపడి కనిపించకుండాపోయి అయిదేళ్లయింది. మహారాష్ట్ర చేరి ఇన్నాళ్లు కాలం వెల్లదీసింది. శారద ఫౌండేషన్ వారి సహకారంతో చివరికి కుంటుబ సభ్యుల చెంతకు చేరింది జగ్గయ్యపేటకు చెందిన కోసూరు రామలక్ష్మి.

అయిదేళ్ల క్రితం అదృశ్యం
అయిదేళ్ల క్రితం అదృశ్యం

By

Published : Feb 27, 2021, 8:37 PM IST

విజయనగరం జిల్లా వేపాట మండలం జగ్గయ్యపేటకు చెందిన కోసూరు రామలక్ష్మికి కల్లేపల్లికి చెందిన శ్రీనుతో వివాహమైంది. రామలక్ష్మీ గర్భవతిగా ఉన్న సమయంలో ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఉండగా..తలపై కొబ్బరికాయ పడింది. ఆ తర్వాత అనారోగ్యం పాలై..మతిస్థిమితం కోల్పోయి పుట్టింటికి చేరుకుంది. కొంత కాలానికి ఆమె తల్లి చనిపోవటంతో రామలక్ష్మీ రోడ్డు పడింది.

గత 5 సంవత్సరాలుగా కనిపించకుండా పోయి...ఊర్లు తిరుగుతూ మహారాష్ట్రకు చేరుకుంది. అక్కడి పోలీసులు ఆమెను శారద ఫౌండేషన్ వారికి 2019లో అప్పగించగా..వారు ఏడాదిన్నర పాటు వైద్య సేవలు అందించటంతో ఆమె ఆరోగ్యం సాధారాణ స్థితికి వచ్చింది. అనంతరం రామలక్ష్మి స్వగ్రామం జగ్గయ్యపేటకు పంపించారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన రామలక్ష్మీని చూసి ఉళ్లోని బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details