విజయనగరం జిల్లా కురుపాంలో ఏడాదిగా సంచరిస్తున్న అడవి ఏనుగులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి(55) వరికోతకు వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయనగరంలో ఏనుగుల దాడి.. మహిళ మృతి - విజయనగరంలో అడవి ఏనుగుల దాడిలో మహిళ మృతి వార్తలు
విజయనగరం జిల్లాలో జరిగిన అడవి ఏనుగుల దాడిలో గంట చిన్నమ్మి అనే మహిళ మృతి చెందింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏనుగుల దాడిలో మృతిచెందిన మహిళ
TAGGED:
అడవి ఏనుగుల దాడిలో మహిళ మృతి