విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వెంటనే మంచినీరు సరఫరా చేయాలనీ.. కొళాయిలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. నీటి కొరతపై అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి బైఠాయింపుతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - అంటిపేట
మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఐద్వా ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు