విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని 160 మంది మహిళలు చేయూత పథకానికి అర్హులై ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయానికి గత కొంతకాలంగా తిరుగుతున్నారు. అయితే వాలంటీర్ లాగీన్ లేదని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. సమస్య పెద్దది కావడంతో గురువారం సచివాలయానికి చేరుకున్న ఎంపీడీవో సి. హెచ్ సూర్యనారాయణ...అక్కడి మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారు మరింత ఆగ్రహానికి గురై.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపీడీవోను చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్య ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల మేరకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీడీవో, ఎస్సై వారికి చెప్పారు.
సమస్య ఇదే...