విజయనగరం జిల్లా పార్వతీపురంలో విద్యుదాఘాతంతో ఓ వివాహిత మృతిచెందింది. పట్టణంలోని గౌడ వీధికి చెందిన మాలతి బట్టలు ఇస్త్రీ చేసేందుకు ఐరన్ బాక్సు పట్టుకున్నారు. దానికి విద్యుత్ ప్రసరించి షాక్ కొట్టింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాలతి మరణించింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇస్త్రీ పెట్టె పట్టుకుంటే కరెంట్ షాక్... మహిళ మృతి - పార్వతీపురంలో కరెంట్ షాక్తో మహిళ మృతి వార్తలు
బట్టలు ఇస్త్రీ చేసేందుకు ఐరన్ బాక్సు పట్టుకుంటే షాక్ కొట్టి మహిళ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి