ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాకెలాంటి పథకాలు రాలేదు.. ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ - Vizianagaram Latest News

Woman Deposed MLA : విజయనగరం జిల్లా బొబ్బిలిలో గడప గడపకు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. 19వ వార్డులోని ఓ మహిళ తనకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఎమ్మెల్యేని నిలదీసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేదంటే ఒప్పుకునేది లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉంటే మహిళకు పథకాలు అందేలా చేయాలని సిబ్బందికి సూచించి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Gadapa Gadapa program in Bobbili
గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేని నిలదీసిన మహిళ

By

Published : Dec 15, 2022, 7:22 PM IST

Woman Deposed MLA: విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘంలోని 19వ వార్డులో గురువారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత అనే మహిళ తనకు ఎలాంటి పథకాలు అందలేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. విద్యావసతి కాని విద్యాదీవెన కాని రాలేదన్నారు. ఎన్నికల ముందు ఏవో చెబుతారని.. తర్వాత ఏమీ చేయరని ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన పని కాలేదని వాపోయారు. తనకు సొంత ఇల్లు లేదని.. మామ గారి ఇంట్లోనే ఉంటున్నానని.. ఆయన ఆధార్ కార్డు తన రేషన్ కార్డుతో లింక్​ అప్ చేయడంతో పథకాలు దూరమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు ఇల్లు కట్టుకోవాలని ఇంటి పట్టానిచ్చినా.. గడువు ఇవ్వలేకపోవడంతో ఇల్లు కట్టుకోలేకపోయానని.. సిబ్బంది వచ్చి ఇల్లు కడతారా? కట్టరా అని ఒత్తిడి చేయడంతో పట్టాను వెనక్కి ఇచ్చినట్లు వాపోయారు. పైగా అనువుగా లేనిచోట ఇంటి పట్టాలు ఇవ్వడంతో ఇల్లు కట్టుకొని ఉండలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి ఈ పరిస్థితికి గల కారణాలను పక్కనే ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డు తన మామయ్య రేషన్ కార్డుతో లింక్​ అయి ఉండటంతో పథకాలు రావడం లేదని సిబ్బంది బదులిచ్చారు.. వెంటనే ఆమెకు అన్ని అర్హతలు ఉంటే పథకాలు వర్తింపజేయాలని సిబ్బందికి సూచించారు.

గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేని నిలదీసిన మహిళ

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details