విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి చెందిన రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట కాలువల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతుంది. కానీ సుందరపేటను ఆనుకుని ఉన్న విజయరామసాగరంలోకి నీరు చేరడం లేదు. జాతీయ రహదారి విస్తరణ జరుగడంతో విజయరామసాగరానికి నీరు వెళ్లేందుకు డ్యామ్ నిర్మించారు. దీని ఎత్తు తక్కువ చేయడంతో డెంకాడ ఆయకట్టు డ్యామ్ నుంచి వచ్చిన నీరంతా వృథాగా పోతుంది. ఈ విషయాన్ని సంబంధిత జాతీయ రహదారి విస్తరణ అధికారులకు, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదు. వర్షాలు పడుతున్న సమయంలో నీరంతా వృథాగా పోవడంతో విజయ రామ సాగర్ కింద ఉన్న సుమారు 56 ఎకరాల పంట భూమి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన! - the dam has been lowered so The rainy water is wasting away at sundarapeta
డ్యామునే నమ్ముకున్న అక్కడి రైతులకు జాతీయ రహదారి విస్తరణ బాధనే మిగుల్చుతోంది. రోడ్డువిస్తరణ పేరుతో డ్యాము ఎత్తును తగ్గించడంతో.... వర్షం నీరంతా వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో...రైతన్నలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
![అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4558177-1050-4558177-1569491610585.jpg)
Bhoogapuram Mandal of Vijayanagaram District