మద్యపాన నిషేధం అమలులో భాగంగా... మద్యం దుకాణాలను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతామని.. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్ మెన్లు విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినప్పుడు... తాము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమితులయ్యామని.. ఇప్పుడు షాపుల సంఖ్య తగ్గిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఇవే ఉద్యోగాల్లో కొనసాగించడమో లేక వేరే శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించడమో చేసిన తర్వాతే.. దుకాణాలు తగ్గించాలన్నారు.