ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరే మహిళతో భర్త సహజీవనం... భార్య మౌనదీక్ష - protest

ఆడ పిల్ల పుట్టిందన్న కారణంతో అత్తింటి వారి వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ దత్తివలసలో మహిళ మౌన దీక్ష చేసింది. అదనపు కట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా వేరే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని పేర్కొంది.

'న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మహిళ మౌన దీక్ష'

By

Published : May 26, 2019, 4:51 AM IST

'న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మహిళ మౌన దీక్ష'
భర్త, అత్తమామల నుంచి తనకు ఆదరణ కరవైందంటూ విజయనగరం జిల్లా దత్తివలసలో ఓ మహిళ మౌన పోరాటం చేసింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనను సరిగ్గా చూసుకోవటం లేదని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.
ఇదీ విషయం...
దుగ్గేరు గ్రామానికి చెందిన సింహాచలం పుష్ప దంపతుల కుమార్తె జయంతికి.. గద్వాలకు చెందిన ఆటోడ్రైవర్ చప్పాలా అనిల్ కుమార్ తో 2017 లో వివాహమైంది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో అదనపు కట్నం కోసం వేధించేవారని ఆరోపించింది. బాధలు తట్టుకోలేక తాను పుట్టింటికి వెళ్లిపోయానని... అనంతరం భర్త అనిల్ కుమార్ పెద్ద వలసకు చెందిన ఓ మహిళను తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకుని తల్లి దండ్రులతో పాటు అత్తవారింటి ముందు మౌనదీక్షకు దిగినట్లు బాధితురాలు తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details