విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకాం గ్రామంలో అరుదైన తెల్ల కాకి కనిపించింది. తెలుపు రంగులో ఉన్న పక్షి 'కావ్...కావ్' అంటూ అరుస్తుందేంటని మొదట ఆశ్చర్యపోయిన స్థానికులు... ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఆసక్తిగా తిలకించారు. కొంత మంది దీని ఫోటోలను సెల్ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ శ్వేత వర్ణంలో ఉన్న కాకి చిత్రాలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
శ్వేతవర్ణంలో కాకి.... ఆశ్చర్యపోయిన జనం - white crow in cheepurupalli
కాకి ఏ రంగులో ఉంటుంది అని అడిగితే... నలుపు అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు ఎవరైనా. అయితే కొన్ని కాకులు తెలుపు రంగులో కూడా ఉంటాయండోయ్. మీరు చదివింది నిజమే. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఇలాంటి అరుదైన వాయసం ఒకటి జనం కంట పడింది. ప్రస్తుతం దీని చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
white crow